Wednesday, 20 November 2024
జ్యోతిషామపి తజ్జ్యోతిః
జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పర ముచ్యతే।
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితమ్॥18॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ పరబ్రహ్మం అనేది సూర్యుడికి,అలాగే అగ్నికి తేజస్సును ఇస్తుంది.చీకటికి అందనంతగా,సుదూరంగా ఉంటుంది.అదే జ్ఞానం.అద్గదే జ్ఞేయం.దానిని జ్ఞానంతో మాత్రమే పొందగలము.అది సర్వ హృదయాంతర్యామి.ఆ పరబ్రహ్మమే సర్వ భూతకోటి యొక్క హృదయాంతరాళలో అంతర్యామిగా నివాసం ఏర్పరుచుకోని ఉంటుంది.మనం తప్పకుండా తెలుకోదగిన,ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాన్ని జ్ఞేయం అని అంటారు.కాబట్టి పరబ్రహ్మ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకునే దానికి యత్నం చెయ్యాలి.
Subscribe to:
Posts (Atom)